RELINQUISHMET OF RIGHTS BY MEMBERS OF SERVICE - AMENDMENT (G.O. Ms. No. 92, Dt: 28.08.2023)
RELINQUISHMET OF RIGHTS BY MEMBERS OF SERVICE - AMENDMENT (G.O. Ms. No. 92, Dt: 28.08.2023)
ముఖ్యమైన అంశాలు :
APSSR 1996 నిబంధన 28 లో సవరణ చేస్తూ ఈ జీవో విడుదల చేయబడింది.
గతంలో, ఒక ఉద్యోగి పదోన్నతిని శాశ్వతంగా తిరస్కరిస్తే, భవిష్యత్తులో పదోన్నతికి అర్హత కోల్పోయేవారు.
అయితే, ఈ జీవో ప్రకారం ఇప్పుడు:
ఉద్యోగి promotion post కు చేరిన తర్వాత కూడా permanent relinquishment ఇస్తే సరే, భవిష్యత్తులో promotion vacancy వచ్చినప్పుడు promotion కు consider చేయవచ్చు.
అంటే, పదోన్నతిని ఒకసారి తిరస్కరించినా, అది శాశ్వతంగా కాదు. భవిష్యత్తులో వచ్చిన ఖాళీలకు తిరిగి అవకాశం ఉంటుంది.
ఇది ముఖ్యంగా పదోన్నతి వచ్చిన టీచర్లు, ఉద్యోగులు తిరస్కరించిన సందర్భాల్లో ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు: ఒక టీచర్‌ను HM గా పదోన్నతి ఇచ్చినపుడు, వారు వ్యక్తిగత కారణాల వల్ల లేదా స్థానం నచ్చక తిరస్కరించారు అనుకుందాం. అప్పట్లో వారు permanent relinquishment ఇచ్చినా, ఈ జీవో ప్రకారం తర్వాతి HM ఖాళీ వచ్చినప్పుడు ఆయన/ఆమెను తిరిగి consider చేయవచ్చు.
ప్రభుత్వ జీవో నెం.92, తేదీ 28.08.2023 ద్వారా టీచర్లకు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతిపై సానుకూల నిర్ణయం తీసుకుంది.
పదోన్నతిని తిరస్కరించిన వారికీ, రాబోయే కాలంలో అవకాశం కల్పించే విధంగా సవరణ చేయబడింది. ఈ జీవో ప్రకారం, గతంలో పదోన్నతిని నిరాకరించిన వారికీ తిరిగి అవకాశం లభించవచ్చు.
ఇది ఉద్యోగ భద్రతకు మరియు ఉద్యోగీ హక్కులకు మద్దతుగా ఉంది.
click the below link to download goms no.92