కమిషనర్ గారి వెబెక్సు సారాంశం!
10వ తరగతి:
SCERT 100 రోజుల ఏక్షన్ ప్లానును కచ్చితంగా అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి.
👉ఆర్.జె.డిలు, డి.ఇ.ఓలు, ఎమ్.ఇ.ఓలు, డైట్ లెక్షరర్లు తప్పనిసరిగా ఉదయం మరియు సాయంత్రం స్డడీ అవర్సును మరియు శలవురోజుల్లో స్పెషల్ క్లాసులను పర్యవేక్షంచి రిపోర్టు సమర్పించాలి.
👉 SCERT జారీచేసిన Question Bank and Model Papers ను తప్పనిసరిగా విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలి. పర్యవేక్షణ అధికారులు Question Bankలో ప్రశ్నలను విద్యార్థులను తప్పనిసరిగా అడగాలి.
👉 విద్యార్థులను ఏ,బి,సి గ్రేడులుగా విభజించాలి. సి గ్రేడ్ విద్యార్థులతో ప్రతిరోజు చదివించాలి మరియు రాయించాలి. పర్యవేక్షణ అధికారులు సదరు విద్యార్థుల ప్రతిరోజు ఏమి రాస్తున్నారో పర్యవేక్షణ చేయాలి.
👉రోజువారీ పరీక్షల ఫలితాలను రికార్డునందు నమోదు చేయాలి. సదరు ఫలితాల ఆధారంగా విద్యార్థులను సమీక్షించాలి. పర్యవేక్షణ అధికారులు సదరు రికార్డులను తనిఖీ చేయాలి.
👉విద్యార్థులను ఉపాధ్యాయులకు దత్తత ఇవ్వాలి. వారియొక్క రోజువారి ప్రగతిని దత్తత తీసుకున్న ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి.
👉TIS Data Updation:
• ఉపాధ్యాయుల TIS Data అందరివి మూడు రోజుల్లో తప్పక పూర్తికావాలి.
🌻New Complexes:
20వ తేది కల్లా New Complexes ఏర్పాటు ఉత్తర్వులు విడుదల అగును. మండల స్థాయి కమిటీలు వేసుకొని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రాప్తికి New Complexes ఏర్పాటును సమీక్షించుకోవాలి.
🌻మోడల్ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలలను ఒక ఏర్పాటు చేయుటకు ఏ పాఠశాలలు అనుకూలమో ముందుగా నిర్ణయించుకోవాలి.
👉కాంప్లెక్సు పరిధిలో గల అన్ని పాఠశాలలను సంబంధించిన విషయాలను కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులే అడ్మినిష్ట్రేట్ చేయాలి.
🌻117 జిఓ. - సవరణలు:
117 జివో సవరిస్తూ త్వరలో జిఓ విడుదల అగును.
🌻హైస్కూల్ లో గల 3, 4 తరగతులను పంచాయితీ పరిధిలో గల ప్రాథమిక పాఠశాలలో తిరగి విలీనం చేస్తారు.
👉 ఉపాధ్యాయుల రేషనలైజేషన్ కూడా నిర్వహిస్తారు
👉ఏప్రిల్ నుండి రేషనలైజేషన్, బదిలీల ప్రక్రియ ప్రారంభమగును. పదోన్నతులు కూడా నిర్వహిస్తారు.
🌻కమీషనర్ గారు జిల్లాల పర్యటన:
స్కూల్ కాంప్లెక్సుల ఏర్పాటు, 117 జి.ఓ, మోడల ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు తదితర అంశాలు చర్చించుటకు జనవరి 20వ తేది నుండి కమీషనర్ గారు అన్ని జిల్లాలలో పర్యటిస్తారు.
•
👉ఆర్.జె.డి, డి.ఇ.ఓ, డి.వై.ఇ.ఓ., ఎమ్.ఇ.ఓ, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించే పై అంశాలను సమీక్షిస్తారు. సందేహాలు నివృత్తి చేస్తారు.
🌻పాఠశాలలు – స్టార్ రేటింగ్:
•పాఠశాలల స్టార్ రేటింగ్ మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవాలి.
👉అకడమిక్ పెర్ఫార్మెన్స్ స్టార్ రేటింగ్ పెంచడానికి ఉపాధ్యాయులు తగు కృషిచేయాలి.
🌻ఉపాధ్యాయులు – శలవులు మంజూరు :
•ఉపాధ్యాయులు తమ శలవులను జనవరి నుండే అక్టోబర్ వరకు సమానంగా విభజించుకొని వాడుకోవాలి. అక్టోబర్ లోపు 80 శాతం శలవులు వాడుకోవచ్చును.
👉 కేవలం 20 శాతం శలవులు మాత్రమే నవంబర్, డిశంబర్ నెలల్లో వాడుకోవాలి.
👉 నవంబర్, డిశంబర్ నెలల్లో ఎక్కువ శలవులు వాడుకోవడాన్ని అనుమతించడం జరగదు.
👉 నవంబర్, డిశంబర్ నెలల్లో శలవులు ఎక్కువ వాడుకోకూడదు. అందుకే జనవరి నెలలోనే శలవులపై ఒక ప్రకటన చేస్తున్నాం.
🌻అకడమిక్ కేలండర్:
• 2025-26 నూతన విద్యా సంవత్సరానికి అకడమిక్ కేలండర్ ను ఫిబ్రవరి నెలలోనే విడుదల చేస్తారు.
🌻Students Shoe Size data:
• Students Shoe Size data నమోదుచేయడం ఈ నెల 7వ తేదితో పూర్తయినప్పటికీ కొన్ని పాఠశాలలు ఇంకనూ పూర్తిచేయాలేదు. తేది 09/01/2025 నాటికి 100 శాతం నమోదు పూర్తికావాలి.
🌻పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల శిక్షణ:
•పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల శిక్షణను తేది 09/01/2025 నాటికి అన్ని పాఠశాలల్లో పూర్తిచేయాలి.
👉 యాప్ నందు వాటి వివరాలు నమోదుచేయాలి.
🌻SC Employees and students data:
SC Employees వారి Sub caste డిటెయిల్సు వెంటనే సేకరించి పంపాలి.
👉ఫారిన్ సర్వీసులో ఉన్న ఉద్యోగుల పేరెంట్ డిపార్టుమెంట్ వారి సేకరించి పంపాలి.
👉 పాఠశాలలో 2014 నుండి 2024 వరకు SC స్టూడెంట్సు మరియు వారి Sub caste డిటెయిల్సు ఎక్సెల్ ఫైల్ లో వెంటనే పంపాలి