ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష ద్వారా ఐదో తరగతి ఇంగ్లీష్ మాద్యమంలో ప్రవేశానికి బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు తేదీ 25-1-2024 నుండి 23-2-24 వరకు ఆన్లైన్లో సమర్పించడం గాను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన సమాచారం కొరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు జిల్లా సమన్వయ అధికారులకు లేదా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల ప్రధానాచార్యుల వారిని సంప్రదించగలరు.