స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి.
స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి
స్టెప్ 3: విద్యార్థి స్టడీ లేదా ssc మార్కుల మెమో, విద్యార్థి తండ్రి మరియు తల్లి ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ బర్త్) చేయించుకోవాలి
స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి
స్టెప్ 5: VRO నుండి RI వరకు
RI నుండి MRO..
MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది.
స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి
స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు.