ప్రతి పాఠశాల వారు విద్యార్థుల కు APAAR కి సంబంధించి parent consent form ను ఇచ్చి, డీటెయిల్స్ పూర్తి చేసి వాళ్ళ పేరెంట్స్ సంతకం తీసుకుని, ఆ forms ని జాగ్రత్తగా ఫైల్ చేసుకోవాలి.
🌺 udise లో స్టూడెంట్ మాడ్యూల్ లో students లిస్ట్ లో విద్యార్థుల active స్టూడెంట్స్ లిస్ట్ ఓపెన్ చేయాలి.
🌻 ప్రతీ స్టూడెంట్ ఎదురుగా చివరి కాలంలో UIDAI స్టూడెంట్ డీటెయిల్స్ VERIFIED అని GREEN కలర్ లో ఉంటే ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు.
🏵️ అలా గ్రీన్ కలర్ లో ఉన్న అన్ని పేర్లకు APAAR ID create చేయాలి.
🌻 ఒకవేళ రెడ్ కలర్ లో mismatched అనిగానీ, ఇంకేమైనా మెసేజ్ కానీ ఉంటే వాటికి APAAR ID create అవదు. వాటి సంగతి తరువాత చూడొచ్చు.
🌺 APAAR ID ఎలా generate చేయాలంటే.... (గ్రీన్ కలర్ లో ఉన్నవారికి మాత్రమే)
🌻Udise లోని స్టూడెంట్ మాడ్యూల్ లో APAAR ID module ని ఓపెన్ చేయాలి. విడివిడిగా సెలెక్ట్ చేసుకోవాలి.
🏵️ ప్రతి స్టూడెంట్ కి ఎదురుగా చివరి కాలమ్ లో generate అని ఉంటుంది. అక్కడ సెలెక్ట్ చేయాలి.
🌻 Next Window లో parent consent form వస్తుంది. ముందుగా 'Do you want to change aadhaar details?' అని ఉంటుంది. అక్కడ ఎటువంటి మార్పులు చేయవద్దు. ఆల్రెడీ కరెక్ట్ గా ఉన్న విద్యార్ధులకు మనం APAAR చేస్తున్నాము.
🌺 దాని క్రింద Consent form ఉంటుంది. దానిలో I అని ప్రక్కనే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో తండ్రి/తల్లి/గార్డియన్ పేరు టైప్ చేయాలి.
🌻 తరువాత స్టూడెంట్ పేరు ఉంటుంది. అక్కడ మనం ఏమీ చేయకూడదు. తరువాత రిలేషన్ అడుగుతుంది. ఆ బాక్స్ లో తండ్రి/తల్లి/లీగల్ గార్డియన్ ను సెలెక్ట్ చేయాలి.
🌺 తరువాత ID ప్రూఫ్ నెంబర్ అడుగుతుంది. ఆ బాక్స్ లో ఆధార్ కార్డ్ మొ || ID సెలెక్ట్ చేయాలి. తరువాత ప్రూఫ్ టైపు బాక్స్ లో విద్యార్థి యొక్క తండ్రి/తల్లి/గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్.... మొ|| ID Proof నెంబర్ టైప్ చేయాలి.
🌻చివరిలో place of physical consent అని ఉంటుంది. అక్కడ మీ ప్రాంతం పెరు టైప్ చేయాలి.
🏵️ అంతా అయిపోయాక ఒకసారి చెక్ చేసుకుని చివరిలో Submit చేయాలి...డేటా Edit లేదు.... Confirmation అడుగుతుంది. OK చేస్తే కాంఫైర్మ్ అయిపోయి ఆ స్టూడెంట్ కి APAAR ID generate అవుతుంది.
🌻 ఒకసారి confirm చేసి ok చేస్తే మళ్లీ మళ్లీ మార్పులు, చేర్పులకు అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్తగా చేయండి.
🌺Note:- పేరెంట్ సంతకం చేసిన Parent consent form తప్పనిసరిగా మనవద్ద ఫైల్ చేసుకోవాలి.