• Home/
  • /
  • ఏప్రిల్-19 నాటికి మూల్యాంకనం పూర్తి కావాలి..

ఏప్రిల్-19 నాటికి మూల్యాంకనం పూర్తి కావాలి..

 ఏప్రిల్-19 నాటికి మూల్యాంకనం పూర్తి కావాలి..

 
 
ఏప్రిల్-21 నాటికి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్స్ అందజేయాలి..
 
♦️ఏప్రిల్-23 న తేదీన ప్రోగ్రామ్స్ కార్డ్స్ తిరిగి విద్యార్థుల నుండి తీసుకోవాలి మరియు ప్రమోషన్ లిస్టులు అధికారులకు అందజేయాలి.
 
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ – ఎస్సీఈఆర్టీ
 
పత్రికా ప్రకటన (24.3.25)
 
హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు డిజిటలైజేషన్ తో విద్యారంగంలో కొత్త అడుగులు
- వర్క్ షాప్ ప్రారంభ సభలో సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు 
 
హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కేవలం మార్కులు, గ్రేడ్లకే పరిమితం కాకుండా విద్యార్థుల బహుముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి. శ్రీనివాస రావు, ఐ.ఏ.ఎస్ అన్నారు. 
పాఠశాల విద్యాశాఖ,  ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో  హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌పై రెండు రోజుల వర్క్‌షాప్
( ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్ స్టేజ్ ) విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం ప్రారంభమైంది.  ఈ వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా హాజరైన సమగ్ర శిక్షా ఎస్పీడీ మాట్లాడుతూ  విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు, డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు HPC డిజిటలైజేషన్ చేపట్టి విద్యారంగంలో కొత్త అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థుల ప్రగతిని సమగ్రంగా అంచనా వేయడమే  లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 
 
*HPC ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా: PARAKH, NCERT సీఈఓ & హెడ్ ప్రొఫెసర్ ఇంద్రాణి భాదురి *
 
PARAKH, NCERT సీఈఓ & హెడ్ ప్రొఫెసర్ ఇంద్రాణి భాదురి వర్చువల్ విధానంలో మాట్లాడుతూ ‘ప్రతిఒక్క దశలో విద్యార్థుల సామర్థ్యాలను అర్థం చేసుకుని, సరైన మార్గంలో వారిని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు ఈ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు సమర్థవంతమైన మూల్యాంకన విధానాలను అవలంబించాలని పేర్కొన్నారు.
ఈ వర్క్ షాపునకు SCERT ఫ్యాకల్టీ,  ఉపాధ్యాయులు, DIET ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.
 
విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం సమగ్ర శిక్షణ
 
సదస్సులో పాల్గొన్న పరఖ్ స్టేట్ లైజనింగ్ అధికారిణి బిదిషా మజుందర్ ఈ రెండు రోజుల వర్క్ షాప్ విజయవంతం కావాలని ఆశిస్తున్నామని, ఉపాధ్యాయులు, విద్యా నిపుణుల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకుని, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌ను మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.
 
ఈ వర్క్ షాపులో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్  ఎం.వి. కృష్ణారెడ్డి, PARAKH నిపుణులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు పాల్గొని కీలక సూచనలు చేశారు. విద్యార్థుల మౌలిక, ప్రాథమిక, మధ్యస్థ స్థాయిలలో సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
 
ఫొటోలు
1. వర్క్ షాప్ ప్రారంభిస్తున్న సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు
2. మాట్లాడుతున్న  సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు
3. మాట్లాడుతున్న పరఖ్ స్టేట్ లైజనింగ్ అధికారిణి బిదిషా మజుందర్
4. పాల్గొన్న డైట్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, రిసోర్సు పర్సన్లు.
 
- ఎం.వి. కృష్ణారెడ్డి,
 
డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ