కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీం పేరుతో కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది .
ఏప్రిల్ ఒకటి 2025 నుండి అమల్లోకి వస్తుంది.
25సంవత్సరాల సర్వీసుచేసినఉద్యోగి చివరి 12 నెలల జీతం లో 50% పెన్షన్ గా చెల్లిస్తారు . ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెరిగినప్పుడు పెన్షనర్లకు కూడా పెరుగుతుంది.
గతంలో వలెనే గ్రాట్యూటీ కూడా ఉంటుంది
ఆరు నెలల సర్వీస్కు ఒక నెల జీతం+ కరువుభత్యం లో 10% అదనపు గ్రాట్యు టిగా చెల్లిస్తారు.
అయితే సిపిఎస్ పథకంలో వలెనే ఉద్యోగ జీతంలో నుండి 10% మినహాయింపు ఉంటుంది.
ఇది cps కు మరో రూపమే తప్ప పాత పెన్షన్ విధానం కాదు.
స్టాక్ మార్కెట్ల లో పెట్టిన డబ్బు పై పెన్షన్ ఇవ్వడానికి సరిపడినంత ఆదాయం రాకపోతే ప్రభుత్వం భరిస్తుంది.
ఇందుకు గాను ప్రభుత్వ వాటా 14% నుండి 18.5 శాతానికి పెంచ వలసి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.