• Home/
  • /
  • పెన్షనర్లు కు విజ్ఞప్తి

పెన్షనర్లు కు విజ్ఞప్తి

 పెన్షనర్లు కు విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరము జనవరి, ఫిబ్రవరి మాసములో మాత్రమే తమ లైఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ లో సమర్పించవలసివున్నది.
 
అలాగే 2025 జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఇవ్వవలసివున్నది.
 
 
కానీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ 2025 వ సంవత్సరానికి వారి లైఫ్ సర్టిఫికేట్ అక్టోబర్ 2024 నుండి సమర్పించెదరు.
 
 
అందువలన కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తెలియక మరియు అవగాహన లేనందువలన వాళ్ళతోపాటు, ఇప్పుడే వాళ్ల లైఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చుచున్నారు.  
 
 
అలా ఇచ్చినవి చెల్లవు అని గమనించగలరు. 
 
కనుక రాష్ట్ర ప్రభుత్వ Pensioners ఎవ్వరు 2024 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసములలో తమ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవద్దు అని మనవి.  
 
 
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు 2025 జనవరి, ఫిబ్రవరి మాసములలో మాత్రమే తమ లైఫ్ సర్టిఫికేట్స్  ఇవ్వవలసినదిగా కొరుచున్నాము.
                          
From:
జనరల్ సెక్రటరీ
స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్       అసోసియేషన్, 
ఎన్టీఆర్ జిల్లా బ్రాంచ్, విజయవాడ.
9490106799