• Home/
  • /
  • సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (SALT) లో భాగంగా, రాష్ట్రంలోని అన్ని తరగతి గదులలో Teach Tool సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ద్వారా అబ్జర్వేషన్స్ జరుగుతున్నాయి

సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (SALT) లో భాగంగా, రాష్ట్రంలోని అన్ని తరగతి గదులలో Teach Tool సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ద్వారా అబ్జర్వేషన్స్ జరుగుతున్నాయి

 గౌరవనీయులు ఉపాధ్యాయులు,

 
సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (SALT) లో భాగంగా, రాష్ట్రంలోని అన్ని తరగతి గదులలో Teach Tool సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ద్వారా అబ్జర్వేషన్స్ జరుగుతున్నాయి. ఈ అబ్జర్వేషన్స్ ఉపాధ్యాయులకు వారి బోధనా శైలిని అర్థం చేసుకోవడంలో మరియు మెరుగుపరచడంలో సహాయపడతాయి.
 
Teach Tool మరియు పరిశీలన అంశాలు గురించి మరింత అవగాహన కలిగి ఉండేందుకు, ఉపాధ్యాయులందరూ AP Teacher Bot ను యాక్సెస్ చేసి Teach Tool Video ను చూడాలి.
 
వీడియో చూసిన తర్వాత, ఉపాధ్యాయులు 5 ప్రశ్నల క్విజ్ ను పూర్తి చేయాలి. క్విజ్ పూర్తి చేయడం ద్వారా మీ పాల్గొనడం నమోదు అవుతుంది.
 
---
 
”Teach Tool Video" యాక్సెస్ చేయడానికి దశలు:
 
1. SwiftChat యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయండి. [లింక్](https://cgweb.page.link/ydtsZHd4yTm7Fgod7)
2. మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి.
3. AP Teacher Bot కోసం సెర్చ్ చేయండి లేదా ఈ [లింక్](https://cgweb.page.link/ydtsZHd4yTm7Fgod7) ద్వారా నేరుగా బాట్ లోకి వెళ్లండి.
4. హాయ్ అని పంపి బాట్ సంభాషణను ప్రారంభించండి.
5. మీ UDISE కోడ్ మరియు CFMS ID నమోదు చేయండి.
6. Access Learning Content"> Access a Course పై క్లిక్ చేయండి.
7. TEACH Tool Videos"> Cycle~1 ను ఎంచుకుని వీడియోను వీక్షించండి.
8. వీడియో పూర్తయ్యాక, Yes, continue పై క్లిక్ చేసి క్విజ్ పూర్తి చేయండి.
 
---
 
గమనిక సాంకేతిక లోపం కారణంగా, AY 2022-2023లో అబ్జర్వ్ చేయబడిన ఉపాధ్యాయులకు Teach Tool Video కోర్సు జాబితాలో రెండుసార్లు కనిపించవచ్చు. దయచేసి Teach Tool Video అనే శీర్షికతో ఉన్న కోర్సును ఎంచుకోండి.
 
---
 
అభినందనలు
SCERT మరియు సమగ్ర శిక్ష  
ఆంధ్ర ప్రదేశ్
 
---